అయితే ఇంకా నిరుద్యోగ ప్రయోజనాల కోసం నమోదు చేసుకోని వారి సంఖ్య భారీగా ఉందనే వాదన ఉంది. అధికారికంగా 2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారని అధికారికంగా చెబుతున్నా ఆ సంఖ్య 5 కోట్ల వరకూ ఉంటుందని అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ అండ్ కాంగ్రెస్ ఆఫ్ ఇండిస్టియల్ ఆర్గనైజేషన్స్(ఎఎఫ్‌ఎల్‌ాసిఐఓ) అధ్యక్షుడు రిచర్డ్ త్రుంకా పేర్కొన్నారు.
ఉద్యోగాల కోసం ఎదురుచూసి నిరుత్సాహ పడిన వారిని, పార్ట్‌టైమ్ జాబ్ చేసే వారిని కూడా ఇది లెక్కలోకి తీసుకోలేదు. తద్వారా 22.8 శాతం నిరుద్యోగం ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు వచ్చిన జీతభత్యాలపై ఆధారపడి జీవిస్తున్న ఫ్లోరిడా, ఫిలడెల్ఫియోల్లో నిరుద్యోగులను ఉటంకిస్తూ ఈ సంఖ్యల వెనుక నిజమైన వ్యక్తులు ఉన్నారని త్రుంకా పేర్కొన్నారు.