దీంతో ఆ బాధకు మేలుకున్న ఆమె తనకు గొంతు నొప్పిగా ఉందని చెప్పింది. కంఠంలో ఏదో కలియ తిప్పేస్తున్నట్లు బాధగా ఉందని మెలికలు తిరిగింది. ఆమె బాధను చూసిన కుటుంబ సభ్యులు ఆందోళన చెంది, వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడి వైద్యులు ముందుగా ఆ మహిళకు మత్తుమందు ఇచ్చి ఆ తర్వాత ఆపరేషన్ చేశారు. అపుడు వారికి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం ఒకటి కనిపించింది. ఆమె కంఠంలో నాలుగడుగుల పాము దూరింది. అందుకే ఆమె అంత ఇబ్బంది పడుతోంది. చాలా జాగ్రత్తగా ఆ పామును బయటకు తీసిన వైద్యులు దాన్ని చూసి వణికిపోయారు. బాధితురాలి కుటుంబ సభ్యులకైతే నోటమాటలేదు.