212 గ్రాముల బరువుతో పుట్టిన బిడ్డ.. ఆపిల్‌ పండు కన్నా తక్కువే..

మంగళవారం, 10 ఆగస్టు 2021 (17:44 IST)
కొన్ని నెలల క్రితం కేవలం 212 గ్రాముల బరువుతో పుట్టిన బిడ్డను కాపాడటానికి డాక్టర్లు అంతే శ్రమపడ్డారు. బిడ్డకోసం తపించిపోయని ఆ తల్లిదండ్రులకు తీపి కబురు చెప్పారు. 25 వారాలపాటు శ్రిమించిన డాక్టర్లు 212 గ్రాముల బరువుతో పుట్టిన బిడ్డగా గిన్నిస్ బుక్ గుర్తించి ఆ పసిపాపను రక్షించారు. ఎట్టకేలకు ఆ బిడ్డ పుట్టిన 13 నెలలకు అంటే జన్మదినం కూడా అయిపోయాక ఇంటికి క్షేమంగా చేరుకుంది. 
 
సింగపూర్‌లోని నేషనల్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌ (NUH)లో 2020 జూన్‌ 9న నెలలు నిండకుండానే ఓ పాప 24 సెంటీమీటర్ల పొడవు, కేవలం 212 గ్రాముల బరువుతో పుట్టింది. అంటే సగటు ఆపిల్‌ పండు కన్నా తక్కువ బరువు ఉంది అంటూ ఆ పసిగుడ్డు అప్పట్లో గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. ఆ బిడ్డ బతకటం కష్టమని డాక్టర్లు కూడా చెప్పటంతో తల్లిదండ్రుల వేదనకు అంతులేకుండాపోయింది. 
 
తమ చిట్టితల్లి తమకు దక్కదని బోరున విలపించారు. కానీ గుండె కొట్టుకుంటున్న మా బిడ్డను ఎలాగైనా బతికించమని డాక్టర్ల కాళ్లమీద పడి వేడుకున్నారు.కానీ గ్యారంటీ అయితే చెప్పలేం కానీ మా శక్తికి మించి ప్రయత్నిస్తామని తెలిపిన డాక్టర్ల అప్పటినుంచి ఆ పసిగుడ్డుకు ఎంతగానో వైద్యం చేశారు. తప్పని పరిస్థితుల్లో తల్లిదండ్రులు అనుమతితో రిస్క్‌ తీసుకుని మరీ ట్రీట్ మెంట్ చేశారు. అలా 13 నెలలపాటు ఫ్రీ ట్రీట్‌మెంట్‌ ద్వారా ప్రయత్నించారు ఎన్‌హెచ్‌యూ డాక్టర్లు.
 
13 నెలల ఐసీయూ చికిత్సలో అద్భుతమే జరిగిందని చెప్పాలి. అలా ఆ పసిగుడ్డు బరువు పెరగటానికి ఎన్నో యత్నాలు చేశారు. కేవలం 212 గ్రాముల బరువు నుంచి 6.3 కేజీల ఆరోగ్యవంతమైన బరువుకు ఆ చిన్నారిని తయారు చేశారు.
 
చక్కటి ఆరోగ్యంతో బిడ్డ తయారు కావటంతో ఈ మధ్యే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు.. ఇతర వైద్య సిబ్బంది తమ ఇన్ని సంవత్సరాల సర్వీసులో ఇంత తక్కువ బరువుతో పుట్టిన బిడ్డను ఎప్పుడూ చూడలేదని తెలిపారు. 
 
ఆ బిడ్డ పుట్టినప్పుడు తమ కళ్లను తామే నమ్మలేకపోయామని ఇది శిశువేనా? అనే డౌట్ కూడా వచ్చిందని తెలిపారు. ఆ బిడ్డకు వెక్‌(క్వెక్‌) యూ గ్జువాన్‌ అని పేరుపెట్టుకున్న ఆ తల్లిదండ్రులు.. చిన్నారి ఆరోగ్యంగా తమ చేతికి దక్కడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు