21న సూర్యగ్రహణం : భూకంపాలు, సునామీకి ఛాన్సెస్... నిపుణులు వార్నింగ్ (Video)

ఆదివారం, 20 ఆగస్టు 2017 (12:54 IST)
సోమవారం అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడనుంది. 1979 సంవత్సరం తర్వాత కనిపించనున్న అతిపెద్ద సూర్యగ్రహణం ఇదే. ఈ సూర్యగ్రహణం కారణంగా ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గుతాయని, దీని కారణంగా టోర్నడోలు ఏర్పడటం, భూకంపాలు, సునామీలు సంభవించడం వంటి విపత్తులకు ఆస్కారముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.
 
ఈ సూర్యగ్రహణం సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ సుమారు ఆరు గంటల పాటు సాగే గ్రహణం అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. అయితే, ఈ గ్రహణం ఏర్పడే సమయంలో భారత్‌లో మాత్రం రాత్రి సమయం. అందువల్ల ఇండియాలో కనిపించే అవకాశం లేదు. ఫలితంగా ఈ సూర్యగ్రహణ ప్రభావం భారత్‌పై ఏమాత్రం ఉండదు.
 
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భువిపై ఉన్న వివిధ రకాల ప్రాణాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న విషయమై నాసా పరిశోధనలు చేయనుంది. ఇదిలావుండగా, అమెరికాపై సూర్యగ్రహణ ప్రభావం ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. పలు ప్రాంతాలను టోర్నడోలు వణికిస్తున్నాయి. 

 

Here's the best way to watch the solar eclipse if you don't have special glasses pic.twitter.com/mxPHdB2mRu

— Business Insider (@businessinsider) August 19, 2017

వెబ్దునియా పై చదవండి