ఇది భారతదేశంలో వుండిన కన్యాశుల్కం పద్ధతి లాంటిది. అమ్మాయిని వేలానికి పెట్టిన తర్వాత నగదు, విలువైన వస్తువులు లేదా పశు సంపదను ఇవ్వడం ద్వారా పాటను పాడుకోవాలి. అత్యంత విలువైన వస్తువులు ఎవరు ఇస్తే వారికే ఆ అమ్మాయి దక్కుతుంది. ఇటీవల దక్షిణ సూడాన్‌లో ఒక వ్యాపారవేత్త ఇలాంటి వేలంలో 500 ఆవులు, 3 లగ్జరీ కార్లు, రూ. 1.44 లక్షలు కట్నంగా ఇచ్చి 17 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
దారుణమైన విషయం ఏమిటంటే.. ఆ అమ్మాయి అధికారికంగా శవానికే భార్య.. కానీ ఆ శోభనం జరిగిన వ్యక్తితో అసలు సంబంధమే ఉండదు. అయితే శవంతో పెళ్లిన అమ్మాయిని వితంతువుగా మాత్రం భావించరు. ఇదొక దుష్ట సాంప్రదాయంగా ఎన్నో అంతర్జాతీయ సంస్థలు ఉద్యమాలు జరిపాయి. ఇప్పుడిప్పుడే సూడాన్ మహిళల్లో చైతన్యం వచ్చి.. ఇలాంటి పెళ్లిళ్లు చేసుకోమని తెగేసి చెబుతున్నారు.
అయితే ఆ లోపం పురుషుడిలో ఉందా స్త్రీలో ఉందా అనేది గమనించకుండా.. అలా చాలా పెళ్లిళ్లు చేసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. ప్రస్తుతం దక్షిణ సూడాన్‌లో కొనసాగుతున్న ఈ దుష్ట సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి కొన్ని విధానాలు రూపొందించింది. అంతర్జాతీయ సమాజం సహకారంతో అక్కడ మహిళల్లో చైతన్యం తీసుకొని రావడానికి కార్యాచరణ రూపొందించింది.