ఆ అవార్డు తీసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటా: నయనతార

శుక్రవారం, 2 అక్టోబరు 2020 (13:14 IST)
దక్షిణాది సూపర్ స్టార్‌గా పేరు సంపాదించిన నయనతార ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. దక్షిణాది భాషల్లో అందం, అభినయంతో అలరించిన నయనతార.. వ్యక్తిగత విషయాల్లో మాత్రం అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తోంది. 
 
శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం బ్రేకప్ అయిన తర్వాత నయనతార ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో లవ్‌లో వుంది. ఇప్పటికే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ జంట ప్రేమ గురించి అందరికీ తెలుసు. కానీ పెళ్లి విషయంలో గతంలో విఘ్నేశ్ శివన్ క్లారిటీ ఇచ్చాడు. 
 
కెరీర్ పరంగా కొన్ని లక్ష్యాలను చేరుకునేంతవరకు పెళ్లి విషయాన్ని పక్కనబెట్టినట్లు విఘ్నేశ్ చెప్పుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో విఘ్నేశ్, నయనతార వివాహంపై తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే..? నయన పెళ్లిపై ఓ క్లారిటీకి వచ్చిందని తెలుస్తోంది. జాతీయ అవార్డు గెలుచుకునేంతవరకు ఆమె వివాహం చేసుకోకూడదని డిసైడ్ అయినట్లు సమాచారం. 
 
''అరమ్'' అనే సినిమాకు ఇప్పటికే పలు అవార్డులు సొంతం చేసుకున్న నయనతార ఖాతాలో ఇంకా జాతీయ అవార్డు మాత్రమే పడలేదు. అది కనుక పడితే.. తప్పకుండా విక్కీతో నయన పెళ్లికి సిద్ధమని పచ్చజెండా ఊపేస్తుందని సమాచారం. మరి నయనతార ఎప్పుడు జాతీయ అవార్డు గెలుచుకుంటుందో.. విక్కీని ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు