ఒకేసారి రెండు తుఫాన్‌లా... ఎక్కడ?

గురువారం, 21 మార్చి 2019 (19:53 IST)
ఒకేసారి రెండు పెను తుఫాన్‌లు రానున్నాయట. ఇదేమిటి భారతదేశంలో ఇప్పుడే కదా వేసవి కాలం ప్రారంభమైంది. రెండు తుఫాన్‌లు ఎలా వస్తాయని ఆశ్చర్యపోతున్నారా? అది ఇక్కడ కాదండీ.. ఆస్ట్రేలియా దేశంలో రెండు పెను తుఫాన్లు విరుచుకుపడనున్నాయి. దాదాపు సమాన వేగంతో కూడిన ఈ రెండు తుఫాన్‌లు మరింత బలపడుతున్నాయని అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
ఒక తుఫాను ఉత్తర భూభాగం వైపు, మరొకటి పశ్చిమ భూభాగం వైపు తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. రెండు తుఫాన్లు శనివారం ఒకేసారి తీరం దాటే అవకాశాలున్నందున ప్రభుత్వం ఉత్తర ఆస్ట్రేలియా భూభాగంలోని ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడింది. ఈ తుఫాన్లు తీరం దాటే సమయంలో దాదాపు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు