ప్రేమకు చిహ్నంగా ప్రపంచ కళాఖండంగా వెలుగుతున్న తాజ్ మహల్ ఘనత మరో మెట్టు ఎక్కింది. అంతర్జాతీయ ట్రిప్ అడ్వైజర్ సంస్థ తాజాగా రూపొందించిన జాబితా ప్రకారం మన తాజ్ మహల్ ప్రపంచ అద్బుత కట్టడాల్లో ఐదో స్థానంలోనూ, ఆసియా అద్భుత కట్టడాల్లో రెండో స్థానంలో నిలిచింది. పర్యాటక సేవలందించే ప్రముఖ ‘ట్రిప్ అడ్వైజర్’ సంస్థ ఈ జాబితాను రూపొందించింది.
ఇక రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా అబుదాబిలోని షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ సెంటర్, స్పెయిన్‌లోని మెజ్‌క్విటా క్యాథడ్రెల్ డీ కోర్డొబా, వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా నిలిచాయి. తర్వాత స్థానాల్లో రష్యాలోని ‘చర్చ్ ఆఫ్ ద సేవియర్ ఆన్ స్పిల్ల్‌డ్ బ్లడ్ (6), బీజింగ్‌లోని గ్రేట్‌వాల్ (7), పెరూలోని మచుపిచు (8) స్పెయిన్‌లోని ప్లాజా డీ ఎస్పనా (9), ఇటలీలోని డ్యుమో డీ మిలానో (10) నిలిచాయి.