తాలిబన్ తీవ్రవాదుల గుప్పెట్లో మరో నగరం... కాబూల్‌కు కూతవేటు దూరంలో

ఆదివారం, 15 ఆగస్టు 2021 (13:39 IST)
పాకిస్థాన్ సైన్యం అండతో తాలిబన్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలు కీలకమైన నగరాలను తమ ఆధీనంలో తెచ్చుకున్న తాలిబన్లు ఇపుడు మరో కీలక నగరమైన జలాలాబాద్‌ను కూడా తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కాబూల్ దేశంలోని తూర్పు ప్రాంతం నుంచి తెగిపోయింది. తాలిబాన్ ఆదివారం ఉదయం ఆన్‌లైన్‌లో కొన్ని ఫోటోలను విడుదల చేసింది.
 
దీనిలో నంగర్‌హార్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌లోని గవర్నర్ కార్యాలయంలో తమ మనుషులను చూడవచ్చు. తీవ్రవాదులు జలాలాబాద్‌ను స్వాధీనం చేసుకున్నారని ప్రావిన్స్ ఎంపీ అబరుల్లా మురాద్ అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు. ఇప్పుడు ప్రధాన నగరాల్లో కాబూల్ మాత్రమే ప్రభుత్వానికి మిగిలి ఉంది. ఈ నగర శివారు ప్రాంతంలో తాలిబన్ తీవ్రవాదులు కూతవేటు దూరంలో మకాంవేసివున్నారు. 
 
కాగా, గత వారంలో ఆఫ్ఘనిస్తాన్‌లో పెద్ద భాగాలను తాలిబాన్ స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు, అమెరికా, బ్రిటన్, కెనడా అక్కడ ఉన్న తమ దౌత్య సిబ్బందికి సహాయం చేయడానికి సైన్యాన్ని పంపాయి. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో పెద్ద, బలమైన రక్షణ నగరాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు