మేకకు.. బొప్పాయి పండుకు కూడా కరోనా సోకింది.. ఎలాగంటే?

మంగళవారం, 5 మే 2020 (09:57 IST)
కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. లాక్ డౌన్ విధించినా.. కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే వుంది. కరోనాకు ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టకపోవడంతో పాటు తగిన మందులు కూడా కుదరకపోవడంతో.. ఆ వ్యాధి సోకకుండా వుండేందుకు జనాలు అప్రమత్తంగా వున్నారు. ఈ కరోనా వైరస్ సోకకుండా వుండేందుకు సామాజిక దూరం పాటిస్తున్నారు. 
 
కరోనా వైరస్ ఇప్పటివరకు మనుషులకు, పులులు, పిల్లులు వంటి కొన్ని జంతువులకూ వచ్చింది. అయితే విచిత్రంగా ఓ మేకకు, మరీ విచిత్రంగా ఓ బొప్పాయి పండుకు కరోనా సోకింది. ఈ వింత సంఘటన టాంజానియాలో చోటు చేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే టాంజానియా దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ చేసే పరీక్షా కిట్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. దీన్ని మనుషులతోపాటు బొప్పాయి, మేక, గొర్రెల పైనా పరీక్షించింది. ఈ క్రమంలో గొర్రె మినహా మిగతా రెండింటికి వైరస్ సోకినట్లు తప్పుడు ఫలితాలివ్వడంతో కిట్లలో డొల్లతనం బయటపడింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు జాన్ మగుఫులి దిగుమతి చేసుకున్న టెస్టు కిట్లలో సాంకేతిక లోపాలున్నాయని వెల్లడించారు. వీటి వాడకాన్ని నిలిపివేస్తూ దర్యాప్తుకు ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు