ప్రముఖ శాస్త్రవేత్త, దివంగత స్టీఫెన్ హాకింగ్ తన చివరి పుస్తకంలో మానవాళిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడిపై చర్చనీయాంశమైన వ్యాఖ్యలు చేశారు. దేవుడనే వాడే లేడని, విశ్వ సృష్టికర్త కూడా లేడని, మానవ భవిష్యత్తును ఎవరూ శాసించలేరని.. తన లాంటి దివ్యాంగులకు దేవుని శాపమే కారణమని చెప్పారు.
మరణానంతరం స్వర్గం, నరకం వంటివేమీ ఉండవని, మరణానంతర జీవితమంటే, కోరికలతో నిండిన ఆలోచనలని చెప్పేందుకు ఆధారాలు లేవని కూడా స్టీఫెన్స్ తన చివరి పుస్తకంలో రాశారు. భూమిని వీడటం తప్ప మానవాళికి మరో మార్గం లేదని, భూమిని వీడకుంటే మానవులంతా అంతరించిపోతారని స్టీఫెన్ అంచనా వేశారు.
మరో వందేళ్లలో మనిషి మేధస్సును కంప్యూటర్లు మించిపోనున్నాయని, మానసిక, శారీరక లక్షణాలను మెరుగుపరచుకోవడం తప్ప మానవాళి ముందు మరో మార్గం లేదని హెచ్చరించారు. జన్యు మార్పులతో 'సూపర్ హ్యూమన్'లను సృష్టిస్తే పెను ముప్పేనని కూడా అంచనా వేశారు.