చంద్రుడిపై కార్లు తిరగబోతున్నాయంటే నమ్మితీరాల్సిందే. అక్కడ కూడా కార్ రేసులు జరుగుతాయట. ఇది నిజమే. త్వరలో చంద్రుడిపై కార్లను పంపనున్నారు. ఇందుకోసం అమెరికా హైస్కూల్ విద్యార్థులు రెండు కార్లను డిజైన్ చేయనున్నారు. ఈ కార్లను రిమోట్ కంట్రోల్ ద్వారా నడపనున్నారు. భూమిమీద నుండే రిమోట్ ద్వారా అక్కడ కార్లను నడపనున్నారు. 2021 అక్టోబర్‌లో జాబిల్లిపైనా కార్ రేస్ కూడా నిర్వహించనున్నారట.
మూన్ మార్క్ మిషన్-1 పేరుతో అమెరికాలో 6 వేర్వేరు హైస్కూల్ విద్యార్థులతో కార్లను డిజైన్ చేయించనున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా సంకేతాలు పంపొచ్చని, ఇంట్యూటివ్ మెషీన్స్ ల్యాండర్‌ను వైఫైతో కనెక్ట్ చేయడం ద్వారా రేసు నడుస్తుందని కంపెనీ సీటీవో తెలిపారు.