మార్గమధ్యంలో ఏదో మర్చిపోయినట్టు అనిపించిన ఆమె అసలు విషయం గుర్తొచ్చి షాక్‌కు గురైంది. వెయింటిగ్ హాల్‌లో తన నవజాత శిశువును వదిలేసి విమానం ఎక్కిన విషయం గుర్తు రావడంతో ఒళ్లంతా చెమటలు పట్టాయి. విషయం విమాన సిబ్బందికి చెప్పడంతో వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించి ఫ్లైట్‌ను వెనక్కి తిప్పారు.
పైలట్ చెప్పిన విషయాన్ని విన్న ఏటీసీ ఆశ్చర్యపోయింది, ఆపై అనంతరం విమానం వెనక్కి వచ్చేందుకు ఏటీసీ అనుమతి ఇచ్చింది. విమానం ల్యాండ్ అయ్యాక ఎయిర్‌పోర్టు సిబ్బంది శిశువును ఆమె తల్లికి అప్పగించడంతో కథ సుఖాంతమైంది. ఇక ఏటీసీతో పైలట్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.