జలదిగ్బంధంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం

శుక్రవారం, 19 నవంబరు 2021 (09:12 IST)
తిరుమల, తిరుపతిలో వానలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా, తిరుమల గిరులపై కొండంత వాన కురియడంతో తిరుపతి పట్టణం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో అనేక ప్రాంతాలు మోకాలి లోతు నీటిలో చిక్కుకున్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం కూడా ఉంది. ఆయన ఇల్లుతో పాటు ఆయన ఇల్లు ఉన్న నివాసం కూడా వర్షపునీటిలో చిక్కుకుంది. 
 
తిరుపతిలో కురిసిన భారీవర్షానికి ఇంటి వైపు పొలాల నుంచి వచ్చిన వరద నీరు ఇంటిని చుట్టుముట్టింది. దీంతో భద్రతా సిబ్బంది గదితో పాటు... ఉద్యావనం పూర్తిగా నీటమునిగింది. పైగా, ఈ విషయం తెలిసినప్పటికీ పంచాయతీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో సర్పంచ్ లక్ష్మీ భర్త గిరి నాయుడు, చంద్రబాబు సోదరుడు సుబ్రహ్మణ్యం నాయుడులు యంత్రాలతో నీటిని బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు