ఆసియా ఆర్థిక కేంద్రమైన హాంగ్‌కాంగ్ గజగజ వణికిపోతోంది. పవర్‌ఫుల్ టైఫూన్ 'హటో' తీవ్రతకు చివురుటాకులా వణికిపోతోంది. టైఫూన్ దాటికి ఆఫీసులు, స్కూళ్లు బంద్ చేశారు. అంతేనా.. ఏకంగా 450 స్వదేశీ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు.
టైఫూన్ వల్ల 126 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇది 207 కిలోమీటర్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ట్రేడింగ్ కూడా నిలిపివేశారు. హటో వల్ల అనేక వృక్షాలు నేలకూలాయి. భవనాలకు ఉన్న అద్దాల కిటికీలు పగిలిపోయాయి. టైఫూన్ విధ్వంసం భయానకంగా ఉన్నట్టు సమాచారం. అయితే, ఇప్పటివరకు పెద్దగా ప్రాణనష్టం సంభవించలేదు.