ప్రపంచంలోనే తొలిసారి డ్రైవర్‌లెస్ బస్సు ప్రారంభం.. ఎక్కడ..?
శుక్రవారం, 12 మే 2023 (12:48 IST)
First Driverless Bus
స్కాట్లాండ్ ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రైవర్‌లెస్ బస్సును ప్రారంభించనుంది. వచ్చే వారం నుంచి ఈ బస్సును ప్రయాణికుల కోసం నడపనున్నారు.
ప్రపంచంలోని డ్రైవర్‌లెస్ కార్లు ఇప్పటికే పనిచేస్తున్నాయని, డ్రైవర్‌లెస్ బస్సును స్కాట్లాండ్‌లో తొలిసారిగా నడపనున్నట్లు ఆ దేశ బస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.
ప్రపంచంలోనే ఆటోమేటిక్ ప్యాసింజర్ బస్సులను నడపడం ఇదే తొలిసారి అని, సెన్సార్లతో కూడిన ఈ బస్సులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించామన్నారు.
అయితే అదే సమయంలో పూర్తిగా ఆటోమేటిక్ బస్సులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనందున, బస్సు నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రతి బస్సులో సేఫ్టీ డ్రైవర్ ఉంటారని బస్సు నిర్వాహకులు తెలిపారు.