భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి భారీ సాయం..

మంగళవారం, 29 జూన్ 2021 (17:53 IST)
మహమ్మారితో సతమతమవుతోన్న భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి భారీ సాయం ప్రకటించింది. కరోనా ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కోవడానికి 41 మిలియన్ డాలర్లు సాయం చేయనున్నట్లు తెలిపింది. తాజాగా ప్రకటించిన సాయంతో కలిపి భారత్‌కు మొత్తం రెండు వందల మిలియన్ డాలర్లను అమెరికా అందజేస్తోంది. అమెరికా నుంచి అందనున్న నిధులను కోవిడ్ టెస్టింగ్‌, మెంట‌ల్ హెల్త్ స‌ర్వీస్‌, మెడిక‌ల్ స‌ర్వీస్‌కు ఖ‌ర్చు చేయ‌నున్నారు.
 
ఇక క‌రోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న స‌మ‌యంలో మే నెల‌లో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ భార‌త్‌కు 100 మిలియ‌న్ డాల‌ర్ల సాయం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అలాగే అంత‌కుముందు 50 మిలియ‌న్ల డాల‌ర్ల విలువ చేసే అత్యవ‌స‌ర వైద్య ప‌రిక‌రాల‌ను భార‌త్‌కు పంపింది అగ్ర‌రాజ్యం. 
 
అంతేగాక భార‌త్‌కు 25 మిలియ‌న్ డోసుల క‌రోనా వ్యాక్సిన్లు పంపుతామ‌ని బైడెన్ ప్ర‌క‌టించారు. అటు యూఎస్‌-ఇండియా ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఫౌండేష‌న్ కూడా ఏకంగా 1.2 మిలియ‌న్ డాల‌ర్ల విరాళాలు సేక‌రించి, క‌రోనాతో పోరాడుతున్న భార‌త్‌కు చేదోడుగా నిలిచింది. అలాగే సుమారు 120 వెంటిలేట‌ర్లు, 1000 ఆక్సిజ‌న్ కాన్స‌ట్రేట‌ర్లను ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు