అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కరోనా పాజిటివ్

గురువారం, 25 ఆగస్టు 2022 (08:11 IST)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. వంట్లో నలతగా ఉండటంతో జిల్ బైడెన్‌కు బుధవారం కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారని వైట్‌హౌస్ తెలిపింది. 
 
కాగా, ఇటీవల జో బైడెన్ కూడా కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. దీనిపై బైడెన్ డిప్యూటీ కమ్యూనికేషన్స్ డైరెక్టరేట్ కెల్సే డోనాహ్యూ మాట్లాడుతూ, యాంటిజెన్ టెస్టులో కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని, అందుకే ప్రథమ మహిళను డెలావేర్‌లోనే ఐసోలేషన్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు