శాండ్ విచ్ తిని రూ.6లక్షల టిప్ చెల్లించింది.. అంతే తల పట్టుకుని?

శనివారం, 25 నవంబరు 2023 (15:06 IST)
అమెరికాలోని ఓ సబ్ వే రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళ ఏడు డాలర్ల శాండ్ విచ్ తిని ఏకంగా ఏడు వేల డాలర్లకు పైగా టిప్ ఇచ్చి తలపట్టుకుంది. అంటే రూ.632ల బిల్లుకు దాదాపు రూ.6 లక్షల టిప్ ఇచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే... వేరా కార్నర్ అనే కస్టమర్ ఇటాలియన్ సబ్ వేలో ఇటీవల ఓ శాండ్ విచ్ తిని బిల్లు చెల్లించే సమయంలో పొరపాటున 7.54 డాలర్లు కొట్టాల్సిన చోట పొరపాటున తన ఫోన్ నెంబర్ కొట్టింది. 
 
బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డుతో ఈ ట్రాన్సాక్షన్ పూర్తిచేసింది. ఆ మేరకు బిల్లు అందుకున్నాక కానీ వేరా తన పొరపాటును గుర్తించలేదు. 
 
ఆపై బ్యాంకుకు పరుగులు పెట్టినా ఉపయోగం లేకుండా పోయింది. తన సొమ్మును తిరిగి తన ఖాతాలో జమ చేయాలన్న వేరా కోరికను బ్యాంకు వాళ్లు తొలుత తిరస్కరించారు. 
 
అయితే బ్యాంకు వాళ్లు సంప్రదించడంతో సబ్ వే మేనేజ్ మెంట్ కూడా సానుకూలంగా స్పందించింది.. పొరపాటున చెల్లించిన టిప్ మొత్తాన్ని తిరిగిచ్చేందుకు అంగీకరించింది. దీంతో వేరా కార్నర్ ఊపిరి పీల్చుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు