వ్యాక్సిన్ వేసుకోండి, యుఏఇ వ‌చ్చేయండి

బుధవారం, 4 ఆగస్టు 2021 (10:53 IST)
విదేశీ సంద‌ర్శ‌కుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్. రేప‌టి నుంచి అంటే ఆగ‌స్టు 5 నుంచి ... 5 నుండి యుఏఇ లోకి ప్రవేశించడానికి అనుమతిస్తున్నారు. చెల్లుబాటు అయ్యే యుఏఇ  రెసిడెన్సీ వీసాలు ఉండి, యూఏఈ ఆమోదించిన వ్యాక్సిన్ల రెండు డోసులను పూర్తి చేసుకున్న నివాసితులు మాత్రమే యూఏఈ వచ్చేందుకు అర్హులు అని జాతీయ అత్యవసర సంక్షోభం, విపత్తుల నిర్వహణ సంస్థ (NCEMA) తెలిపింది. 
 
ప్రయాణానికి ముందు వ్యాక్సిన్ రెండవ డోసు పూర్తై కనీసం 14 రోజులు అయ్యి ఉండాలి అని అధికార యంత్రాంగం తెలిపింది. అలాగే, ప్రయాణికులు తమ వ్యాక్సిన్ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. యూఏఈ లో ఆమోదించబడిన వ్యాక్సిన్లు ఫైజర్, ఆస్ట్రాజెనెకా లేదా కోవిషీల్డ్, సినోఫార్మ్, స్పుత్నిక్.
 
ఇక వ్యాక్సిన్లు తీసుకున్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, యూఏఈ లో పనిచేసే వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులకు మిన‌హాయించారు. అలాగే విద్యా రంగంలో పనిచేస్తున్న నివాసితులు, విద్యార్థులు, ప్రభుత్వ సంస్థలలో పనిచేసే కార్మికుల‌ను కూడా అనుమ‌తిస్తారు.  మినహాయించబడిన అన్ని వర్గాలు అవసరమైన అనుమతులు పొందేందుకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ సిటిజన్‌షిప్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సమర్థులైన అధికారులు ఆమోదించిన టీకా సర్టిఫికెట్‌లను వారు అప్లికేషన్‌తో పాటు జతపరచాలి. వారు బయలుదేరిన తేదీ నుండి 48 గంటలలోపు గుర్తింపు పొందిన లాబరేటరీల నుండి నెగటివ్ పిసిఆర్ పరీక్షను సమర్పించాలి. ఈ పత్రంలో QR కోడ్‌ని కలిగి ఉండాలి. తిరిగి యూఏఈ చేరగానే పిసిఆర్ పరీక్ష చేయించుకొని హోమ్ క్వారంటైన్ చేయాలి. ఇలాంటి నిబంధ‌న‌ల‌తో యుఏఇ గేట్లు తెర‌వ‌డంతో సంద‌ర్శ‌కులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు