ఊరికి సమీపంలోని ఫైజర్ ఫార్మాస్యూటికల్ కంపెనీ వల్లనే ఆ గొర్రెలు రెచ్చిపోయాయని కథనం ప్రచురించింది. ఈ కంపెనీలో తయారుచేసిన వయాగ్రా మందు పొరబాటున హార్బర్‌లోని నీళ్లలో కలిసిందని, వాటిని తాగడం వల్లే గొర్రెలు ఇలా ప్రవర్తించాయని పేర్కొంది.
అయితే ఈ వార్తలను ఫైజర్ ప్రతినిధులు ఖండించారు. తాము పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించే ఉత్పత్తులనూ తయారుచేయడం లేదని వారు స్పష్టం చేశారు. ఈ గొర్రెల ఘటనకు, తమ కంపెనీకి అస్సలు సంబంధం లేదని పేర్కొన్నారు. ఇలా ఎందుకు జరిగిందో కూడా తమకు తెలియదని అధికారులు చెప్పారు.