దొంగతనానికి వెళ్లి ఇంటి యజమానిని లేపి వైఫై పాస్‌వర్డ్ అడిగాడు, ఎందుకో?

గురువారం, 29 అక్టోబరు 2020 (13:36 IST)
దొంగతనం అనగానే మనకు గర్తుకు వచ్చేది కత్తులు, తుపాకులతో బెదిరించడం, హత్య చేయడం మాత్రమే. కానీ అందరు దొంగలు ఒకే రీతిలో దొంగతనాలకు పాల్పడరు. ఒక్కొక్కరు ఒక్కో విధానంలో దొంగతనం చేస్తుంటారు. కొందరు గుట్టుచప్పుడు కాకుండా దొంగతనం చేస్తే కొందరు ఫన్నీగా దొంగతనానికి పాల్పడతారు.
 
ఇక్కడ అలాంటిదే జరిగింది. కాలిఫోర్నియాలోని పాలా ఆల్టోలో ఈస్ట్ చార్టెస్టన్ ప్రాంతంలో ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ సుమారు 12 గంటలకు ఓ దొంగ ప్రవేశించాడు. అతడి వయస్సు 17 ఏళ్లు, అతడు మెల్లగా వెళ్లి ఆ ఇంటి యజమానిని లేపాడు. ఇంట్లో ఇద్దరు వృద్ధ దంపతులు మాత్రమే ఉన్నారు. దొంగను చూడగానే ఇద్దరూ షాక్ అయ్యారు.
 
వెంటనే ఆ దొంగ ఇంటి యజమాని దగ్గర నా ఇంటర్నెట్ డేటా ముగిసింది. దయచేసి మీ వైఫై పాస్‌వర్డ్ చెబుతారా అని అడిగాడు. దీంతో ఇంటి యజమాని అతడ్ని ప్రక్కకు తోసేశాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఆ దొంగ పారిపోతుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు. గతంలో ఆ దొంగ ఓ బైక్‌ను కూడా చోరీ చేశాడని సమాచారం. ఇలా కొందరు ఫన్నీ దొంగలు కూడా ఉంటారన్నమాట.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు