సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్ చేసిందనీ ఉద్యోగికి కంపెనీ బాస్ గోడకుర్చీ వేసిన ఘటన చైనాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... చెైనాకు చెందిన ఒక మహిళ ఓ కార్యాలయంలో పని చేస్తోంది. ఆమె విధులకు హాజరయ్యేందుకు కారులో ఆఫీసుకు వచ్చింది. లోపలికి వచ్చి ఎప్పటి మాదిరిగానే సహచర ఉద్యోగులతో మాట్లాడుతూ విధుల్లో మునిగిపోయింది. ఇంతలో ఆమెకు బాస్ నుంచి పిలుపువచ్చింది.