అయితే అపోలోకు, ఒరాయన్‌కు ఉన్న తేడాలను నిశితంగా పరిశీలిస్తే, అపోలో ముగ్గురు ఆస్ట్రోనట్స్‌ను 13 రోజుల యాత్రకు తీసుకెళ్లగలదు. కానీ, ఒరాయన్.. నలుగురు వ్యోమగాములను 21 రోజుల యాత్రకు తరలించగలదు.
అపోలో క్రూ మాడ్యుల్ వ్యాసం 12.8 అడుగులు కాగా, ఒరయాన్ వెడల్పు 16.5 అడుగులు. అపోలో ఆరు అడుగులు కన్నా తక్కువ ఎత్తు ఉన్న పురుషులను తీసుకెళుతుంది. ఒరయాన్ మాత్రం ఇందుకు భిన్నంగా స్త్రీపురుషులను తీసుకెళుతుంది.