దక్షిణాసియా మూలాలున్న వారిపై విద్వేష దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఘటన ప్రాముఖ్యం సంతరించుకొంది. స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకు హాజరయ్యేందుకు రైలులో వెళ్తున్నప్పుడు ఓ వ్యక్తితనపై బిగ్గరగా అరుస్తూ విద్వేష వ్యాఖ్యలు చేశారని న్యూయార్క్‌టైమ్స్‌కు బాధిత బాలిక రాజ్‌ప్రీత్ హెయిర్ చెప్పారు. తాను ఇండియానాలోనే పుట్టానని వివరించారు. ఈ ఘటనపై రైలులోని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసినట్లు తెలిపారు.