3 నిమిషాలకు మించి కౌగలింత వద్దు.. 'గుడ్‌బై హగ్‌'పై పరిమితి...

ఠాగూర్

సోమవారం, 21 అక్టోబరు 2024 (14:59 IST)
విమానాల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లేవారికి తమ కుటుంబ సభ్యులు, ఆప్తులకు సెండాఫ్, ఫేర్‌వెల్ ఇస్తూ గుడ్ బై హగ్ (కౌగలింత) ఇస్తుంటారు. ఇలాంటి కౌగలింతపై న్యూజిలాండ్ విమానాశ్రయంలో పరిమితులు విధించారు. కేవలం మూడు నిమిషాలకు మించి కౌగలింతలు వద్దని సూచించింది. విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ అధికమవుతుందని, పైగా, ఎక్కువ మందికి అవకాశం ఇచ్చేందుకు ఈ తరహా పరిమితి విధించినట్టు విమానాశ్రయ సీఈవో పేర్కొన్నారు. 
 
కివీస్‌లోని డ్యునెడిన్ విమానాశ్రయంలో డ్రాప్ అఫ్ ఏరియాలో అధికారులు సైన్ బోర్డు ఏర్పాటు చేశారు. ఎవరో ప్రయాణికుడు దీనని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దీనిపై విపరీతమైన చర్చ సాగుతుంది. 
 
కౌలిలింతకు టైమ్ లిమిట్ ఏమింటూ కొందరు విమర్శలు చేయగా, మరికొందరు ఈ కొత్త నిబంధనను ప్రశంసిస్తున్నారు. ఇతర విమానాశ్రయాల్లోనూ ఇలాంటి నిబంధనే తీసుకుని రావాలని కోరుతున్నారు. కొందరు మాత్రం డ్రాప్ అఫ్ ఏరియా ఇంకా ఉచితమేనా అని ఆశ్చర్యపోతున్నారు. 
 
కాగా, ఈ సైన్ బోర్డు ఏర్పాటుపై విమానాశ్రయ సీఈవో డేనియర్ డి బోనో మాట్లాడుతూ, విమానాశ్రయాలు ఎమోషనల్ హాట్‌స్పాట్లు అని అభివర్ణించారు. 20 సెకన్ల కౌగిలింతకే అవసరమైనంత లవ్ హార్మోన్ అక్సిటోసిన్ విడుదలవుతుందని పేర్కొన్నారు. తక్కువ సమయం కౌగిలింతల వల్ల ఎక్కువ మందికి అవకాశం లభిస్తుందని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు