అర్థరాత్రిళ్లు బట్టలు లేకుండా తిరుగుతున్న వ్యక్తిని చూసిన ఆ మహిళ ఏం చేసిందంటే...

బుధవారం, 27 మార్చి 2019 (11:16 IST)
టెక్సాస్‌లో ఓ వ్యక్తి అర్థరాత్రిళ్లు నగ్నంగా తిరుగుతున్నాడు. గారెట్ గ్రాండీ అనే వ్యక్తి తన ఇంటిలో అతని భార్యతో కలిసి నిద్రించేందుకు సిద్ధమై బెడ్రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేయగానే అతని భార్య ఒక్కసారిగా బిగ్గరగా అరిచింది. 
 
కిటికీలో నుంచి ఆమెకు ఆదో ఆకారం కనిపించగా అది దయ్యం అనుకుని ఆమె అరిచిందని, అయితే ఒక నల్లజాతి వ్యక్తి పరుగెత్తడం తాను చూసానని అతని భర్త చెప్పాడు. అయితే అతను పూర్తి నగ్నంగా ఉన్నాడని, కొద్దిసేపటి తర్వాత ఇంటి ముందువైపుకు వచ్చి కాలింగ్‌బెల్ నొక్కినట్లు పేర్కొన్నాడు.
 
అయితే అతని ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో తలుపు తెరిచేందుకు తాము సాహసించలేదని చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించామని, పోలీసులు వచ్చేలోపే అతను పారిపోయాడని పేర్కొన్నాడు. 
 
ఆ ప్రాంతంలో రెండు నెలల క్రితం కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయని స్థానికులు పేర్కొన్నారు. అయితే మళ్లీ అదే వ్యక్తి అక్కడికి వచ్చి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడ్డారు. అయితే ఆ వ్యక్తి తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవటంతో త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు