భార్యాభర్తల మధ్య గొడవ... తీర్పు చెప్తానని వచ్చి లేపుకెళ్లాడు...

మంగళవారం, 26 మార్చి 2019 (17:29 IST)
గ్రామాల్లో ఎవరైనా తగాదా పడితే ఆ గ్రామానికి చెందిన పెద్దలు తీర్పు చెప్పి సమస్యను పరిష్కరించడం మనకు తెలిసిందే. ఇలాంటి ఉదాహరణలతో పెదరాయుడు వంటి సినిమాలను కూడా చూశాం. తాజాగా కేరళలోని త్రివేండ్రంలోని కారశేరి పంచాయతీ పరిధిలో తోటుముక్కం గ్రామంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.
 
ఈ గొడవ ఇల్లు దాటి రోడ్డు మీదికి వచ్చింది. దానితో భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న గొడవను పరిష్కరించేందుకు ఆ ఊరికి చెందిన పంచాయతీ పెద్ద రంగంలోకి దిగాడు. భార్యాభర్తలిద్దరినీ కూర్చోబెట్టి వారి సమస్య ఏంటని అడిగాడు. ఇద్దరూ తమ సమస్య ఇదీ అని వివరించారు. ఆ రోజు రాత్రి పొద్దుపోవడంతో రేపు చూద్దాం వెళ్లమని అన్నాడు పెద్ద. దాంతో భార్యాభర్తలిద్దరూ ఇంటికి వెళ్లిపోయారు. 
 
ఐతే తెల్లారాక లేచి చూస్తే ప్రక్కనే భార్య కనిపించలేదు. ఏమైందోనని ఆందోళనపడ్డాడు. మళ్లీ పంచాయతీ పెద్దకు చెబుదామని పరుగున వెళ్తే అతడూ కనిపించలేదు. ఏమీ అర్థంకాక... పంచాయతీ పెద్ద ఇంటికి పక్కనే వున్న ఇరుగుపొరుగుని అడిగితే... నీ భార్య ఆయనతో తెల్లవారు జామును లేచిపోవడం తాము చూశామని సమాధానమిచ్చారు. దీనితో అతడు షాకయ్యాడు. తీర్పు చెపుతానని తన భార్యనే లేపుకుపోయాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా తీర్పు చెప్తానన్న ఊరిపెద్ద వయసు 60 ఏళ్లు కాగా... అతడితో వెళ్లిపోయిన మహిళ వయసు 44 ఏళ్లు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు