వివిధ దేశాల మధ్య జరిగిన అనేక కీలక ఒప్పందాలతో పాటు.. దేశ రహస్యాలను వికీలీక్స్ సంస్థ ద్వారా అసాంజే లీక్ చేశాడు. దాంతో అనేక దేశాలు ఆయనపై ఇప్పటికీ గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈకేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు స్వీడన్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఆయన పోలీసులకు చిక్కకుండా లండన్‌లోని ఈక్వెడార్ దౌత్యకార్యాలయంలో ఆశ్రయం పొందుతూ వచ్చాడు.