ఆ మహిళ ఏప్రిల్ 5వ తేదీనే స్పూన్‌ను మింగేసినా చాలా రోజులు వరకు ఆసుపత్రిలో చేరలేదు. కడుపులో పెద్దగా సమస్య లేకపోవడం వల్ల దాన్ని అలాగే వదిలేసింది. ఈమధ్య కడుపులో కొంచెం నొప్పి రావడంతో షెంజెన్ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించింది. కడుపులో కనిపించిన స్సూన్‌ను ఎండోస్కోపీ ద్వారా తొలగించాలని వైద్యులు నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ సన్ తింగ్జీ మాట్లాడుతూ కడుపులో ఉన్న స్పూన్ అడ్డంగా ఇరుక్కుపోయిందని, దాన్ని నిలువుగా వచ్చేలా చేసి నెమ్మదిగా గొంతు నుంచి బయటకు తీశామని తెలియజేసారు. కేవలం 10 నిమిషాల్లోనే చికిత్స పూర్తి చేసినట్లు తెలియజేసారు. మెటల్ స్పూన్ కావడం వల్ల కడుపులోని చిన్న ప్రేగు ఆంత్రమూలంలో వాపు ఏర్పడిందని తెలిపారు. చికిత్స తర్వాత లిలీ వేగంగానే కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలియజేసారు.