సనాలో భీకర అంతర్యుద్ధం: 130కి పైగా మృతి

బుధవారం, 29 సెప్టెంబరు 2021 (15:46 IST)
Yemen
యెమన్‌ రాజధాని సనాలో జరిగిన భీకర అంతర్యుద్ధంలో 130 మందికి పైగా మృతిచెందారు. యెమన్‌లో ఏళ్లతరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధంలో కాల్పుల విరమణ ప్రకటించేలా అమెరికా ఒత్తిడి తెస్తోంది. 
 
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు జాతీయ భద్రతా సలహాదారు అయిన జేక్‌ సలివన్‌ రాకుమారుడైన మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌తో భేటీకి సౌదీ అరేబియాకు వెళ్లారు. దీంతో యెమన్‌లో అంతర్యుద్ధాలు మరింత రాజుకున్నాయి. గత ఆరేడేళ్లుగా యెమన్‌ పౌర యుద్ధాలతో అట్టుడుకుతోంది.
 
2014లో ఇరాన్‌ మద్దతుతో హౌతి తిరుగుబాటు దళాలు రాజధాని సనాతోపాటు దేశంలో ఉత్తరాన పలు భాగాలు ఆక్రమించాయి. అమెరికా మద్దతుతో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణదళాలు 2015 మార్చిలో యెమన్‌లో ప్రవేశించి అధ్యక్షుడు హదీకి అండగా నిలిచాయి. అప్పట్నుంచీ అంతర్యుద్ధం కొనసాగుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు