ప్రపంచంలోనే అతి పెద్ద విమానాన్ని తయారుచేయనున్నట్లు చైనా తెలిపింది.
చైనా దేశం అతి పెద్ద విమానం డ్రాగన్ 600 విమానాన్ని రూపొందించేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతినిచ్చింది.
ప్రంపంచలోనే అతి పెద్ద విమానాన్ని రూపొందించేందుకు సిద్ధమైన సంస్థ ఎవిక్ జనరల్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ. ఈ విమానం ఎయిర్ బస్ 320లాగా పెద్దదిగా ఉంటుందని సంస్థ ప్రధాన ఛైర్మెన్ హూ హైయన్ తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ప్రయాణికులు తమను తాము కాపాడుకునేందుకు ఇందులో తగిన వసతులుంటాయని ఆయన తెలిపారు.
తాము నిర్వహించిన సర్వేననుసరించి రానున్న 15 సంవత్సరాలలో ఇలాంటి విమానాలు దాదాపు 60 మేరకు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు.