భద్రతాపరమైన ఆందోళనలతో జాకోబాబాద్ జిల్లా థుల్ పట్టణంలో ఐదు కుటుంబాలకు చెందిన ముప్పై ఐదు మంది హిందువులు పాకిస్థాన్‌ను శాశ్వతంగా వదలిపెట్టి భారత్‌కు పయనమయ్యారు.
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నాయకత్వంలోని పాలనలో సింధూ ప్రావిన్స్‌లో హిందువుల హత్యలు, కిడ్నాప్‌లు, దాడులు ఎక్కువ అయినట్లు పాకిస్థాన్ టుడే దినపత్రిక తన కథనంలో వెల్లడించింది. సింధూ ప్రావిన్స్‌లో అనేక మంది హిందువులు తమ ఆస్తులను అమ్ముకొని వ్యాపారాలను కూడా వదలిపెట్టి పలు ఇతర దేశాలకు వలసవెళ్తున్నారు. తాజా పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన హిందూ నాయకులు మైనారిటీల భద్రతకు హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఉన్నత విద్యావంతులైన సింధ్ ప్రావిన్స్‌లోని హిందువులు డాక్టర్లు, ఇంజనీర్లుగా పనిచేయడంతో పాటు అనేక ప్రధాన వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. 1998 జనాభా లెక్కల ప్రకారం పాకిస్థాన్‌లో 2.7 మిలియన్ల హిందువులు నివసిస్తున్నారు. అనంతరం ఏర్పడ్డ పరిస్థితులతో పెద్ద సంఖ్యలో వలసవెళ్లినట్లు హిందూ నాయకులు చెప్పారు.