అమెరికా సైనిక శిక్షకులను తిరిగి పంపడంపై చర్చలు

శనివారం, 27 ఆగస్టు 2011 (16:45 IST)
అమెరికా సైనిక శిక్షకులను స్వదేశానికి పంపడానికి సంబంధించిన నూతన ఏర్పాటుపై పాకిస్థాన్, అమెరికాలు చర్చిస్తున్నాయి. నూతన ఒప్పందానికి తుదిరూపు వచ్చినట్లయితే మే2కు ముందు ఉన్న పాకిస్థాన్‌లోని అమెరికా సైనిక శిక్షకుల సంఖ్య కుదించబడుతుంది.

మే2న అబోట్టాబాద్‌లో ఒసామా బిన్ లాడెన్‌పై అమెరికా ఏకపక్షంగా దాడి చేయకముందు పాకిస్థాన్‌లో ఎన్ని అమెరికా బలగాలు ఉన్నాయో ఏ పక్షం కూడా బహిరంగంగా వెల్లడించడం లేదు. కొన్ని నివేదికలు మాత్రం సుమారు 200 మంది ఉండవచ్చని చెబుతున్నాయి. మే2న జరిగిన దాడి తర్వాత తమ దేశంలో ఉన్న 90 శాతం అమెరికా సైనికులను తొలగించాలని పాకిస్థాన్ ఒత్తిడి చేస్తున్నది. ఈ అంశం ఇరు దేశాల మధ్య సంబంధాల్లో పెద్ద అవరోధంగా మారింది.

వెబ్దునియా పై చదవండి