ఇంగ్లాండ్‌లోని నియోస్థాన్ ఆలయం దీపావళీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
దీపావళీ పండుగను పురస్కరించుకుని ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రత్యేక పూజల్లో దాదాపు యాభై వేల మంది హిందూ భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదిలావుండగా ప్రతి ఏడాది తాము ఘనంగా దీపావళి పండుగను జరుపుకుంటామని, కాని ఈ సంవత్సరం భారతదేశంలో వచ్చిన వరత తుఫానుల కారణంగా అక్కడి ప్రజలు నిరాశ్రయులైనారని, దీంతో తమలో మునుపటిలాగా పండుగ ఉత్సాహం కనపడటం లేదని కొందరు పెద్దలు అన్నారు.
కాగా పండుగ రోజున ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటున్నట్లు వారు వెల్లడించారు.