ముస్లింల పర్వదినం రంజాన్ సందర్భంగా పవిత్ర యాత్రల్లో పాల్గొన్న 300 మందికిపైగా పౌరులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని ఇండోనేషియా పోలీసులు బుధవారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా 893 రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ఇందులో 312 మంది మృతి చెందారని ఇండోనేషియా పోలీసులు తెలిపారు.
సెప్టెంబరు 13 నుంచి దేశవ్యాప్తంగా ఈ రోడ్డు ప్రమాదాలు జరిగాయని, మృతుల్లో ఎక్కువ మంది మోటారుసైకిళ్లను నడుపుతూ ప్రమాదాలకు గురైయ్యారని చెప్పారు. రంజాన్ సందర్భంగా ఇండోనేషియా ద్వీపాల్లోని నగరాల నుంచి సుమారు 27 మిలియన్ల మంది పౌరులు పవిత్ర యాత్రల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే గత ఏడాది రంజాన్ సందర్భంగా జరిగిన ప్రమాదాల్లో 548 మంది మృతి చెందారు.