ఇజ్రాయేల్‌ నుంచి ఈజిప్టు రాయబారి ఉపసంహరణ

ఆదివారం, 21 ఆగస్టు 2011 (11:32 IST)
ఇజ్రాయేల్ నుంచి ఈజిప్టు రాయబారిని వెనక్కి పిలిపించారు. ఉగ్రవాదులపై సరిహద్దులో ప్రతీకార దాడులు జరిపిన సందర్భంగా ఐదుగురు పోలీసులు మరణించిన ఘటనకు నిరసనగా ఇజ్రాయేల్‌ నుంచి తన రాయబారిని ఉపసంహరించాలని నిర్ణయించుకున్నట్లు ఈజిప్టు ప్రభుత్వ టీవీ వెల్లడించింది.

ఇజ్రాయేల్‌ దళాలకు, ఇజ్రాయేల్‌ భూభాగంలో ఉన్న సాయుధ శక్తులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఫలితంగా ఈజిప్టు భూభాగంలో ఐదుగురు పోలీసులు మరణించినట్లు సమాచార మంత్రి ఒసామా హేకల్‌ను ఉటంకిస్తూ ఎంఇఎన్‌ఎ తెలిపింది. 1979లో ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తొలి అరబ్బు దేశమైన ఈజిప్టు తన రాయబారిని ఆ దేశం నుంచి ఉపసంహరించుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి