బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్ ఇరాక్ యుద్ధంపై బహిరంగ విచారణను ఎదుర్కోబోతున్నారు. అమెరికాతోపాటు ఇరాక్ యుద్ధంలో పాల్గొనాలని టోనీ బ్లెయిర్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద నిర్ణయాలపై టోనీ బ్లెయిర్ను విచారించనున్నారు.
ఇరాక్ యుద్ధంపై జరుగుతున్న విచారణలో పాల్గొనాల్సిందిగా టోనీ బ్లెయిర్ను కోరామని దర్యాప్తు కమిటీ ఛైర్మన్ సర్ జాన్ చిల్కాట్ కోరారు. ఇరాక్ యుద్ధంపై ప్రతిపాదిత విచారణ ఎట్టకేలకు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా తాను తీసుకున్న నిర్ణయాలపై వాగ్మూలం ఇచ్చేందుకు విచారణకు హాజరుకావాలని దర్యాప్తు కమిటీ బ్లెయిర్ని కోరింది.
ఈ విచారణ మొత్తాన్ని బహిరంగం జరపాలని కమిటీ నిర్ణయించింది. బహిరంగ విచారణ ఓ టీవీ షోగా మారే ప్రమాదం ఉందని గతంలో టోనీ బ్లెయిర్ హెచ్చరించారు. అయితే విచారణలో ప్రజలు వినదగిన వాగ్మూలాలన్నీ టీవీల్లో ప్రసారం అవతాయన్నారు. దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశాలపై మాత్రం విచారణను రహస్యంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.