ఇరాన్‌లో 13 మంది తిరుగుబాటుదారుల ఉరితీత

ఆగ్నేయ ఇరాన్‌లో అధికారిక యంత్రాంగం మంగళవారం 13 మంది తిరుగుబాటుదారులను ఉరితీసింది. సున్ని ముస్లిం తిరుగుబాటు గ్రూపుకు చెందిన 13 సభ్యులకు ఈ ప్రాంతంలో జరిగిన బాంబు దాడులు, హత్యలతో సంబంధం ఉందని నిర్ధారణ అయింది. వీరికి న్యాయవ్యవస్థ ఉరిశిక్ష విధించడంతో, ఈ శిక్షను మంగళవారం అధికారిక యంత్రాంగం అమలు చేసింది.

ఇదిలా ఉంటే జుందల్లా గ్రూపు నేత అబ్దుల్‌మాలిక్ రిగీ సోదరుడు అబ్దుల్‌హమీద్ రిగీకి కూడా 13 మంది ఇతర తిరుగుబాటుదారులతోపాటు ఉరిశిక్ష విధించబడింది. ఆయనను కూడా వీరితోపాటు ఉరిశిక్ష అమలు చేస్తారని భావించాయి. అయితే అబ్దుల్‌హమీద్ రిగీ ఉరిశిక్ష అమలును చివర్లో వాయిదా వేశారు. దీనికి అధికారిక యంత్రాంగం ఎటువంటి కారణాలు వెల్లడించలేదు.

వెబ్దునియా పై చదవండి