ఇస్లామాబాద్‌లో అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

ఇస్లామాబాద్‌లో దాడులకు కుట్రపన్నిన అల్ ఖైదా ఉగ్రవాదులను పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ఇద్దరు ఉగ్రవాదులు పేరుమోసినవారేనని పాకిస్థాన్ పోలీసులు తెలిపారు. నిఘా వ్యవస్థ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. ఇస్లామాబాద్ కాపిటల్ టెరిటరీ పోలీసులు నిషేధిత అల్ ఖైదా, బైతుల్లా మెహసూద్ నేతృత్వంలోని తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్, మహమూద్ ఏజెన్సీ, బునెర్ గ్రూపులకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.

వీరు ఇస్లామాబాద్‌లో దాడుల కోసం పన్నిన కుట్రను భగ్నం చేశారు. అరెస్టు చేసిన ఇద్దరిని ముహమ్మద్ ఓవియాస్ (34), ఉబైదుల్లా (30)లుగా గుర్తించారు. వీరికి ఘాజీ దళంగా పిలిచే తీవ్రవాద గ్రూపుతో, మిరాన్ షా, బట్‌గ్రామ్‌ ప్రాంతాల్లోని తీవ్రవాదులతోనూ సంబంధాలు ఉన్నాయి. ఇస్లామాబాద్ నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు వీరిద్దరూ యువకులను రిక్యూట్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరూ అధునాతన ఆయుధాలు ఉపయోగించడంలోనూ తర్ఫీదు పొందారని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి