ఒబామాకు నోబెల్‌పై జ్యూరీలో భిన్నాభిప్రాయాలు

అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడంలో జ్యూరీ సభ్యుల మధ్య విబేధాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై ఐదుగురు సభ్యులు కలిగిన జ్యూరీ కమిటీలో ముగ్గురు ఒబామాకు నోబెల్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారని నార్వే పత్రిక వెండర్ గార్డ్ తెలిపింది.

శాంతి, నిరాయుధీకరణ ప్రక్రియను ఒబామా నిజం చేయగలరా అన్న అంశంపై కమిటీ సభ్యుల్లో తీవ్ర చర్చ జరిగినట్లు పత్రిక ఓ కథనం వెలువరించింది.

ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతికి ఒబామా చేస్తున్న కృషిని ప్రోత్సహించాల్సిన అవసరంవుందని కమిటీ అధ్యక్షుడు జగ్లాండ్ గట్టిగా సమర్థించినట్లు ఆ పత్రిక వెల్లడించింది. దీంతో కమిటీ సభ్యుల మద్దతు ఒబామాకు లభించిడం వలననే నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు ప్రకటించారని ఆ పత్రిక పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి