ఒబామాతో మంచి సంబంధాలు ఉన్నాయి

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆ దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి హిల్లరీ క్లింటన్ తెలిపారు. అమెరికా అధ్యక్ష పీఠం కోసం కొన్ని నెలల క్రితం వీరిద్దరూ డెమొక్రాట్ పార్టీ తరపున హోరాహోరీగా పోరాడిన సంగతి తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ వెనుకబడిపోగా, బరాక్ ఒబామా ఈ ఏడాది జనవరిలో దేశ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు.

అనంతరం బరాక్ ఒబామా తన ఎన్నికల ప్రత్యర్థికి విదేశాంగ శాఖ అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని అమెరికా మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై హిల్లరీ క్లింటన్ వివరణ ఇచ్చారు. వైట్‌హోస్‌తో తన పనికి సంబంధించిన వ్యవహారాలు సజావుగా సాగుతున్నాయని, దీనికి తాను గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.

బరాక్ ఒబామాతోనూ తన వ్యక్తిగత సంబంధాలు గౌరవప్రదంగా ఉన్నాయన్నారు. ఒబామా పాల్గొన్న జి-8 సమావేశం, రష్యా పర్యటనలతోపాటు ఇటీవల జరిగిన ప్రధాన విదేశీ వ్యవహారాల సదస్సులకు హిల్లరీ క్లింటన్ దూరంగా ఉన్నారు. మోచేతి గాయం కారణాగు ఆమె వీటికి దూరమయ్యారు. అయితే బుధవారం జరిగిన ప్రధాన విదేశీ విధాన కార్యక్రమంలో మాత్రం హిల్లరీ పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి