గడాఫీకి చేరువలో ఉన్నాం: లిబియా తిరుగుబాటుదారులు

బుధవారం, 31 ఆగస్టు 2011 (10:06 IST)
లిబియా నియంత ముయమ్మార్ గడాఫీ చేరువలో ఉన్నట్లు ప్రకటించిన తిరుగుబాటుదారులు గడాఫీ అనుచరులు వారాంతం లోపు లొంగిపోనట్లయితే దాడిచేయాల్సివస్తుందని మంగళవారం హెచ్చరించారు. గడాఫీ ఎక్కడ ఉన్నాడో తమకు తెలిసినట్లు రెబెల్ అగ్రనాయకుడు ఒకరు తెలిపారు.

లిబియాపై పట్టు పెంచుకుంటున్న తిరుగుబాటుదారులు సోమవారం దేశంలోకి ప్రవేశించిన గడాఫీ భార్య, ఆయన ముగ్లురు పిల్లల్ని తిరిగి పంపాలని అల్జీరియాను డిమాండ్ చేశారు. వారంపాటు సాగిన పోరాటం తర్వాత తాము రాజధాని ట్రిపోలీని క్రమంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నట్లు రెబెల్స్ నాయకులు పేర్కొన్నారు.

గడాఫీ దళాలను లొంగిపోవడానికి రెబెల్స్ శనివారం వరకు గడువు విధించారు. అనంతరం తాము ఆయుధాలకు పనిచెప్పాల్సి వస్తుందని తిరుగుబాటుదారుల నేషనల్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ అధిపతి ముస్తాఫా అబ్దుల్ జలీల్ స్పష్టం చేశారు. మరోవైపు నాటో దళాలు గడాఫీ దళాలపై వైమానిక దాడులు చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి