చైనా గ్రేట్ వాల్ ఇంకా పొడవుగా ఉండేది

ప్రపంచ వింతల్లో ఒకటైన చైనా గ్రేట్ వాల్ వాస్తవానికి అనుకున్నదాని కంటే మరో 11 కిలోమీటర్లు ఎక్కువ పొడవు ఉంటుందని పురాతత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మూలాలను వారు ఇప్పుడు గుర్తించారు. గ్రేట్ వాల్‌లో భాగమైన కొత్త భాగాన్ని కిన్ (221-206 బిసి) మరియు హాన్ (206 బిసి- 220 ఎడి) రాజుల పాలనాకాలంలో నిర్మించివుంటారని భావిస్తున్నారు.

దీనిని ఈశాన్య జిలిన్ ప్రావీన్స్‌లో గుర్తించారు. తోంగువా కౌంటీ, జిలిన్ ప్రాంతాల్లో గ్రేట్ వాల్ కొత్త మూలాలను కనుగొన్నారు. ఇంతకుముందు వరకు లియానింగ్ ప్రావీన్స్‌లోని జిన్‌బిన్ కౌంటీలో చైనా గ్రేట్ వాల్ చివరి భాగం ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. తాజా ఆనవాళ్లు లభ్యమైన ప్రదేశం దీనికి తూర్పు దిశగా 10.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో గ్రేట్ వాల్ పొడవు మరో 11 కిలోమీటర్లు ఎక్కువ ఉండవచ్చని పరిశోధక బృందం భావిస్తోంది.

వెబ్దునియా పై చదవండి