జపాన్ మాజీ ఆర్థిక మంత్రి నకగవా మృతి చెందినట్టు ఆ దేశ పోలీసులు వెల్లడించారు. అయితే, ఆయన మృతికి గల కారణాలను మాత్రం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 56 సంవత్సరాల న్యాయ నిపుణుడు తన ఇంటిలోని పడకగదిలో శవంగా పడివున్నట్టు టోక్యో పోలీసు ప్రతినిధి తెలిపారు.
గత ఫిబ్రవరి నెలలో జరిగిన జి-7 న్యూస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన చేత బలవంతంగా మద్యం తాగించారని, అందువల్ల ఆయన మరణించినట్టు పోలీసులు చెప్పారు. నకగవా శరీరంపై ఎలాంటి గాయాలు లేవని కోడో న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. లిబెరల్ డెమొక్రటిక్ పార్టీకి నకగవా రాజీనామా చేయడం మాజీ ప్రధాని తరో అసోకి గట్టి ఎదురుదెబ్బగా పరిణమించింది.
ఇది ఆగస్టు 30వ తేదీన జరిగిన ఎన్నికల్లో చూపించింది. చివరకు పార్లమెంట్ లోయర్ హౌస్‌కు పోటీ చేసిన నకగవా కూడా ఓడిపోవడం గమనార్హం. టోక్యో విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నకగవా.. తన 30వ యేటనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన తండ్రి అధికబరువు కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో నకగవా రాజకీయ ప్రవేశం చేయక తప్పలేదు.