ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో జరుపుకునే జిలుగు వెలుగుల దీపావళి పండుగను పురస్కరించుకుని అమెరికా ప్రభుత్వం తపాలాబిళ్ళను విడదల చేయాలని సంకల్పించింది.
భారతదేశ ప్రజలు అమితంగా ఇష్టపడే దీపావళి పండుగను గౌరవిస్తు తపాలాబిళ్ళను విడుదల చేయాలని అమెరికాకు చెందిన డెమొక్రటిక్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఫ్రాంక్ పాలోన్ జూనియర్ ఇదే వారం సభలో బిల్లును ప్రవేశపెట్టారు.
తాను సభలో ప్రవేశపెట్టిన బిల్లుకు పలువురు సభ్యులు మద్దతు పలికారని, దీనిపై పౌర తపాలా బిళ్ళల సలహా సమితి దీనిపై కూలంకషంగా చర్చించి ఈ పండుగను గౌరవించి దీపావళిపై తపాలాబిళ్ళను విడుదల చేసేందుకు అన్ని వర్గాలు సమ్మతి తెలుపుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గతంలోను అమెరికా తపాలాశాఖ క్రిస్‌మస్, ఖ్వాజా, హనుకాహ్‍తోపాటు చాలా విషయాలపై ఎన్నో తపాలాబిళ్ళలను విడుదల చేసిందని ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలోనే అమెరికాలోని హిందూ, సిక్కు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు, ముస్లిం తదితర వర్గాల ప్రజలు శనివారంనాడు మైనపువత్తిని వెలిగించి పండుగను ఘనంగా జరుపుకుంటారని, చెడుపై మంచి గెలుపుకు సంకేతంగా ఈ పండుగను జరుపుకుంటారని ఆయన కొనియాడారు.