ప్రపంచవ్యాప్తంగానెలకొన్న ఆర్థిక సంక్షోభం, పెరిగిపోతున్న ఉగ్రవాదం ప్రధాన ఎజెండాగా బుధవారం నుంచి అలీనోద్యమ (నామ్) సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈజిప్టులో జరగనున్న ఈ సమావేశాలకు భారత ప్రధాని మన్మోహన్సింగ్ హాజరవుతున్నారు.
రెండు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో 118 దేశాలు పాలుపంచుకోనున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఎదురవుతున్న సవాళ్లు, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు తదితర ఆర్థిక సంస్థల్లో తీసుకోవలసిన సంస్కరణలపై ఈ దేశాలు ప్రధానంగా చర్చించనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రస్తుత పరిణామాలు ఆటంకంగా పరిణమించిన పలు అంశాలపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కీలకోపన్యాసం చేయనున్నారు.
అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థను స్థిరపరిచేందుకు తీసుకోవాల్సిన స్వల్వకాలిక, ధీర్ఘకాలిక ప్రణాళికలకు తీసుకోవలసిన చర్యలను కూడా ఆయన ఈ సందర్భంగా సూచించే అవకాశాలున్నట్లు సమాచారం.