న్యూయార్క్‌ తీరాన్ని కుదిపేస్తున్న ఇరీన్ తుఫాను

న్యూయార్క్ తీరాన్ని ఇరీన్ తుఫాను కుదిపేస్తోంది. దీంతో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్‌తో పలు రాష్ట్రాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని నర్సింగ్ హోంలు, సీనియర్ సిటిజన్ కేంద్రాలు, ఆవాసాలను ఖాళీ చేయాలని స్థానిక యంత్రాంగం ఆదేశించింది.

అంతేకాకుండా న్యూయార్క్‌తో పాటు న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల గవర్నర్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సౌత్‌జెర్సీలోని ఒక కౌంటీని పూర్తిగా ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఫెడరల్ ప్రభుత్వం, స్థానిక యంత్రాంగాలతో కలిసి ముమ్మర ఏర్పాట్లు చేసినట్లు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కౌమో తెలిపారు.

వెబ్దునియా పై చదవండి