పదివేలమంది ఖైదీలకు స్వేచ్ఛను కల్పించిన లిబియా రెబెల్స్

సోమవారం, 29 ఆగస్టు 2011 (16:23 IST)
లిబియా రాజధాని ట్రిపోలిని తమ ఆధీనంలోకి తీసుకున్న తిరుగుబాటుదారులు నియంత గడాఫీ పాలనలో బంధించబడ్డ పదివేలకు పైగా ఖైదీలకు విముక్తి కల్పించారు. అయితే ఇప్పటికీ సుమారు యాభై వేలమంది తప్పిపోయినట్లు తిరుగుబాటుదారుల సైనిక ప్రతినిధి ఆదివారం వెల్లడించారు.

"గత కొన్ని నెలల్లో 57,000 నుంచి 60,000 మంది ప్రజలు అరెస్ట్ అయ్యారు, వారిలో పదివేలమందికి విముక్తి కల్పించాం" అని బెంఘాజీ పట్టణంలోని తిరుగుబాటుదారుల స్థావరంలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అహ్మద్ ఒమర్ బానీ పేర్కొన్నారు. ట్రిపోలి కోసం యుద్ధం దాదాపు ముగిసింది, రెబెల్స్ రాజధానిని తమ ఆధీనంలోకి తెచ్చుకొన్నప్పటికీ ఇప్పటికీ రాత్రి వేళల్లో కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. కాగా రెబెల్స్, గడాఫీ సేనల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆహారం, ఇంధనం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి