పాకిస్థాన్ శక్తివంతమైంది: ప్రధానమంత్రి గిలానీ

మంగళవారం, 30 ఆగస్టు 2011 (10:31 IST)
పాకిస్థాన్‌ శక్తివంతమైన దేశమని పేర్కొన్న ఆ దేశ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ తమ దేశానికి జాతి ప్రయోజనాలను కాపాడుకోగల సామర్ధ్యం ఉందని అన్నారు. జాతి ప్రయోజనాలను కాపాడటం తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతని లాహోర్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిలానీ పేర్కొన్నారు.

ఏ ఒక్కరి జాతీయ ప్రయోజనాలతో రాజీపడకుండా పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా అమెరికాతో స్నేహ సంబంధాలను కొనసాగించాలని పాకిస్థాన్ కోరుకుంటున్నది ఆయన చెప్పారు. అమెరికా ఏజెంట్ రేమండ్ డేవిస్‌ ఫిబ్రవరిలో లాహోర్‌లో ఇద్దరు పాకిస్థాన్ పౌరులను కాల్చి చంపడంతో వాషింగ్టన్, ఇస్లామాబాద్‌ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మే2న అల్‌ఖైదా ఛీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా కమాండోలు అబోట్టాబాద్‌లో కాల్చి చంపిన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.

వెబ్దునియా పై చదవండి